
కర్నూలు, నెల్లూరు జట్ల విజయం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్‌లో శనివారం మూడో రోజు కర్నూలు, నెల్లూరు జట్లు విజయం సాఽధించాయి. వైఎస్‌ఆర్‌ఆర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కడప జట్టు రెండవ ఇన్నింగ్స్‌లో 39.2 ఓవర్లకు 117 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సీఎండీ ఫైజాన్ 30 పరుగులు, గైబు 35 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని సాయి విఘ్నేష్ అద్భుతంగా బౌలింగ్ చేసి 6 వికెట్లు తీశాడు. రుత్విక్ కళ్యాణ్ 2 వికెట్లు, వివేక్ 2 వికెట్లు తీశారు. దీంతో కర్నూలు జట్టు 66 పరుగులతో విజయం సాధించింది. కర్నూలు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 157 స్కోరు, రెండవ ఇన్నింగ్స్‌లో 140 స్కోరు చేసింది. కడప జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 114 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 117 పరుగులు మాత్రమే చేసింది.
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో...
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో శనివారం మూడో రోజు నెల్లూరు–అనంతపురం జట్ల మధ్య మ్యాచ్ కొనసాగింది. 225 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 63.5 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని యశ్వంత్ 24 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని దేవాన్ష్ 5 వికెట్లు, సంజయ్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 43.5 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కార్తీక్ రెడ్డి 27 పరుగులు, కిరణ్‌కుమార్ 24 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని నేత్రానంద 3 వికెట్లు, రిత్విక్ 3 వికెట్లు, విక్రాంత్ రెడ్డి 2 వికెట్లు, సుశాంత్ 2 వికెట్లు తీశారు. దీంతో నెల్లూరు జట్టు 75 పరుగులతో విజయం సాధించింది.

కర్నూలు, నెల్లూరు జట్ల విజయం