దుండగుల దుశ్చర్య | - | Sakshi
Sakshi News home page

దుండగుల దుశ్చర్య

Jul 20 2025 1:48 PM | Updated on Jul 21 2025 5:23 AM

దుండగుల దుశ్చర్య

దుండగుల దుశ్చర్య

ముద్దనూరు : ముద్దనూరు–జమ్మలమడుగు ఘాట్‌రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పురాతన మునయ్యకోనలోని శివాలయంలోకి ప్రవేశించి బీరువాను పగలగొట్టి అందులోని పూజా, దేవతా సామగ్రిని చెల్లాచెదురు చేశారు. స్థానిక ఎత్తులేటికట్ట సమీపంలోని ఏసుక్రీస్తు విగ్రహం రెండు చేతులను పగలగొట్టారు. శుక్రవారం రాత్రి ప్రొద్దుపోయిన తర్వాత ఈ రెండు సంఘటనలు జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. జనసంచారం లేని ఈ ఘాట్‌రోడ్డు ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement