
దిగజారి ప్రవర్తిస్తున్నారు..
కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ హారికపై జరిగిన దాడిని ఖండిస్తున్నా. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి ఈ ఘటన అద్దం పడుతుంది. కూటమి అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కరువైంది. టీడీపీ, జనసేన పార్టలు దిగజారి ప్రవర్తిస్తున్నాయి. జిల్లా ప్రథమ మహిళకే ఈ పరిస్థితి వస్తే, సామాన్య మహిళలకు రక్షణ ఎక్కడి నుంచి లభిస్తుంది. పోలీసుల సమక్షంలో జెడ్పీ చైర్‌పర్సన్‌పై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. చేతగాని మనుషుల్లా పోలీసులు ఎందుకు నిలబడ్డారో అర్థం కావడం లేదు. మానవ ప్రపంచం సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి.
– పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ, జిల్లా అధ్యక్షులు