
బాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పులివెందుల : చంద్రబాబు ఏడాది పాలనలో చేసిన మోసాలను ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీలోని స్టూడెంట్ వింగ్, మహిళా వింగ్, వలంటీర్ వింగ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వింగ్ వీటితోపాటు మన నాయకులు, కార్యకర్తలకు ఈ కాన్సెప్ట్ తెలియజేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏంటి, ఈ ఏడాది పాలనలో ఆయన ఏమి అమలు చేశారు, ఏమి అమలు చేయలేదనేదే ప్రధాన అంశమన్నారు. చంద్రబాబు నాయుడు మ్యానిఫెస్టోను గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను తెలుగుదేశం పార్టీ ఏవిధంగా మభ్యపెట్టిందో మనకు స్పష్టంగా తెలుస్తోందన్నారు. జగనన్న ప్రొజెక్టర్‌లోని స్పీచ్‌ను చూసిన తర్వాత దాన్ని మన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అంతేకాక ప్రొజెక్టర్ ద్వారా మనం చూసిన అంశాన్ని కరపత్రంగా ముద్రించామని.. ఈ కరపత్రాన్ని ప్రతి ఇంటికి తీసుకపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ప్రొజెక్టర్ ద్వారా మాజీ
సీఎం వైఎస్ జగన్ ప్రసంగం
ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాన్ని ప్రొజెక్టర్ ద్వారా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ నాయకులు వీక్షించారు. వైఎస్ జగన్ ప్రసంగంలో నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, దీపం పథకం, ఉచిత బస్సు, 50ఏళ్లకే పింఛన్ వంటి చంద్రబాబు హామీల ద్వారా ప్రజలు ఏ మేరకు నష్టపోయారో వైఎస్ జగన్ వివరించారు. బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ కరపత్రం ద్వారా రాష్ట్రంలోని నాయకులందరూ చంద్రబాబు మోసాలను ఎండగట్టాలని ఆయన సూచించారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం తర్వాత ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారంటీ పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో కూడిన బాండు పత్రాలను కూడా అందజేశారని పేర్కొన్నారు. ఈ ఏడాది కాలంలో చంద్రబాబు తన ఏడాది పాలనలో ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల పరిశీలకుడు బలరామిరెడ్డి, మండల కన్వీనర్ భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ హఫీజ్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, మాజీ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సర్వోత్తమరెడ్డి, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి, ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్, నూర్‌బాషా, దూదేకుల సంఘం నాయకులు రసూల్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఏడాది పాలనలో అన్ని వర్గాలనూ మోసం చేసిన కూటమి ప్రభుత్వం
చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలోని మోసాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి