
బాలిక అదృశ్యం
వేంపల్లె : వేంపల్లె పంచాయతీ పరిధిలోని పక్కీర్‌పల్లెకు చెందిన సయ్యద్ సుమియా(18) అనే బాలిక అదృశ్యమైంది. ఈ ఘటన సోమవారం పకీరుపల్లె గ్రామంలో కలకలం రేపుతోంది. తల్లిదండ్రులు మాబువలీ, రమీజా గొర్రె పిల్లలను మేపుకొని జీవనం సాగించుకునేవారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు సొంత పని ఉండడంతో కుమార్తె సుమియా చింతలమడుగుపల్లె సమీపంలోని బట్లలకోనకు గొర్రెల పిల్లలను మేపుకునేందుకు తీసుకెళ్లింది. సాయంత్రం 5 గంటలైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గుట్టల ప్రాంతాల్లో వెతికినా కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ నరసింహులు, పోలీసు సిబ్బందితోపాటు బాలిక తల్లిదండ్రులు, బంధువులు చుట్టు పక్కల కొండల్లో పరిశీలించినా గొర్రెల పిల్లలు ఉన్నాయి కానీ, బాలిక కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేశారు. మద్యం తాగుతూ అదే ప్రాంతంలో చింతలమడుగుపల్లెకు చెందిన ముగ్గురు యువకులు కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి వాట్సాప్ స్టేటస్‌లో బాలికకు సంబంధించిన వీడియో కనిపించింది. ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపడుతున్నారు. బాలిక తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలిక కనపడకపోవడంతో పోలీసు స్టేషన్ వద్దకు పక్కీర్‌పల్లె వద్దకు భారీ సంఖ్యలో వెళ్లారు. బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సీఐ నరసింహులు తెలిపారు.
పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

బాలిక అదృశ్యం