నాపేరు తంబెల దీప్తి. మాది రాజంపేట. మధ్యతరగతి కుటుంబం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వల్ల నేను బీటెక్ పూర్తిచేసి క్యాంపస్ సెలక్షన్స్‌లోనే ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం దేశంలో టాప్ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఒకటైన యాక్సెన్‌చర్ కంపెనీలో మంచి ప్యాకెజీతో ఉద్యోగం చేస్తున్నాను. అదే ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం లేకుంటే పేద, మధ్య తరగతికి చెందిన కొన్ని లక్షల మంది ఉన్నత చదువులకు దూరం అయ్యేవారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వల్ల తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి.