
‘వందేభారత్’ ట్రయల్ రన్ విజయవంతం
కడప కోటిరెడ్డిసర్కిల్: దేశంలో అధిక వేగంతో నడుస్తున్న రైళ్లలో ఒకటైన వందే భారత్ రైలు గురువారం కడప– రేణిగుంట మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించారు. కాచిగూడ–చైన్నె మార్గంలో వందేభారత్ రైలు నడిపేందుకు ఈ ట్రయల్ రన్ నిర్వహించినట్లు సమాచారం. కాగా 130 కి.మీ. స్పీడ్‌తో రైలు నడిచినా ఎలాంటి సమ స్యలు ఉత్పన్నం కాలేదని రైల్వే అధికారులు గుర్తించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో త్వరలోనే ఈ మార్గంలో వందేభారత్ రైలు నడిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
220 మంది హాజరు
కడప ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం కడప నగర శివార్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం జరిగిన కౌన్సెలింగ్‌కు 86001వ ర్యాంకు నుంచి 104000 వేల ర్యాంకులకు సంబంధించిన అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 220 మంది అభ్యర్థులు తమ కౌన్సెలింగ్‌ను పూర్తి చేసుకుని ధృవ పత్రాలను పరిశీలించుకున్నారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి, చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఎస్‌ఆర్ లక్ష్మి ప్రసాద్, వెరిఫికేషన్ ఆఫీసర్లు వసుంధర, మల్లేశ్వరమ్మ, లావణ్య, రాజేష్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
నేటి కౌన్సెలింగ్‌కు...
నేడు నిర్వహించబోయే కౌన్సెలింగ్‌కి జిల్లావ్యాప్తంగా 104001 నుంచి 120000 వేల ర్యాంకులు వచ్చిన అభ్యర్థులు రావాలని కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి తెలిపారు.
5 నుంచి సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు
రాజంపేట: నందలూరు సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు వచ్చేనెల 5 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ బీఆర్‌నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుమల టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరితో కలిసి గురువారం తాళ్లపాక, సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవోలునటేష్‌బాబు, ప్రశాంతి పాల్గొన్నారు.

‘వందేభారత్’ ట్రయల్ రన్ విజయవంతం