ఫర్నీచర్‌ దుకాణంలో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఫర్నీచర్‌ దుకాణంలో అగ్నిప్రమాదం

Jun 27 2025 4:37 AM | Updated on Jun 27 2025 4:37 AM

ఫర్నీచర్‌ దుకాణంలో అగ్నిప్రమాదం

ఫర్నీచర్‌ దుకాణంలో అగ్నిప్రమాదం

బద్వేలు అర్బన్‌ : స్థానిక నెల్లూరు రోడ్డులోని శ్రీలక్ష్మీసాయి ఫర్నీచర్‌ దుకాణంలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో దుకాణంలోని సుమారు రూ.10 లక్షలు విలువ చేసే ఫర్నీచర్‌ దగ్ధమయ్యాయి. పట్టణానికి చెందిన సి.హెచ్‌ గోపాలక్రిష్ణ నెల్లూరు రోడ్డులో కొన్నేళ్లుగా ఫర్నీచర్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరే గురువారం దుకాణం తెరిచి వ్యాపారం నిర్వహించుకుని రాత్రి సమయంలో దుకాణం మూసి ఇంటికి వెళ్లాడు. కొద్ది సేపటికి దుకాణం నుంచి దట్టమైన పొగలు వస్తుండడంతో చుట్టుపక్కల వారు గమనించి దుకాణ యజమానికి తెలిపారు. వెంటనే ఆయన అక్కడికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అప్పటికే బయనపల్లె గ్రామంలో ఉన్న ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే దుకాణంలోని సుమారు రూ.10 లక్షలు విలువ చేసే సోఫాసెట్లు, పరుపులు, కూలర్లు, డబుల్‌కాట్‌మంచాలు కాలిపోయాయి. మంటలను అదుపు చేయడంతో కొంత సామగ్రిని కాపాడుకోగలిగారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తోనే అగ్నిప్రమాదం జరిగినట్లు ఫైర్‌ సిబ్బంది తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement