తొండూరు : గ్రామంలో అందరికీ సాయం చేస్తూ ఆదరణ పొందిన పల్లేటి రమేష్‌రెడ్డి(46) రైతు పల్లేటి రమేష్ రెడ్డి బుధవారం విద్యుత్తు షాక్‌తో మృతి చెందాడు. మృతుడి బంధువుల కథనం మేరకు.. మండలంలోని క్రిష్ణంగారిపల్లెకు చెందిన రమేష్‌రెడ్డి, సర్పంచ్ రమణారెడ్డి బుధవారం స్థానిక తాగునీటి బోరు పనిచేయకపోవడంతో అక్కడికి వెళ్లారు. విద్యుత్తు మోటారు స్టాటర్ బాక్స్ వద్దకు వెళ్లి రమేష్‌రెడ్డి స్విచ్ ఆన్ చేయగా షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి ఈశ్వరరెడ్డి, బంధువులు బోరున విలపించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉండగా, ఒకరు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా, మరొకరు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. తొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్‌రెడ్డి మృతి విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల ఇన్‌ఛార్జి వైఎస్.మధురెడ్డి, క్రిష్ణంగారిపల్లె గ్రామానికి చేరుకుని రమేష్‌రెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, రామమునిరెడ్డి, సురేష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, రమణారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
బోరు వద్ద మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం
నివాళులర్పించిన కడప ఎంపీ
వైఎస్ అవినాష్‌రెడ్డి
విద్యుత్ షాక్‌తో రైతు మృతి


