రిమ్స్ మార్చురీలో వ్యక్తి మృతదేహం
కడప అర్బన్ : కడప రిమ్స్ ఆసుపత్రిలో ఈనెల 8 తేదీన అనారోగ్యంతో గుర్తు తెలియని వ్యక్తి (49) చేరాడు. చికిత్స పొందుతూ ఈనెల 19న మృతి చెందాడు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో వుంచారు. అతని వివరాలు తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని అధికారులు తెలిపారు.
యువజనోత్సవాల్లో
జిల్లా విద్యార్థుల ప్రతిభ
కడప ఎడ్యుకేషన్ : యువజన సర్వీసుల శాఖ, విజయవాడ వారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కేఎల్ యూనివర్సిటీలో ఈ నెల 18 నుంచి 20 వ తేదీ వరకు జరిగిన రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల్లో జిల్లాకు చెందిన విద్యార్థినులు ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచారని స్టెప్, ముఖ్య కార్యనిర్వహణాధికారి ఐ.జె. విజయ్ కుమార్ తెలిపారు. కవిత్వంలో ఎస్.హీన ఫిరసత్ ప్రథమ, కథా రచనలో ఎం. వెంకట సాహిత్య ద్వితీయ బహుమతి పొందారని తెలిపారు. రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి వీరికి బహుమతులు ప్రదానం చేశారు. ప్రథమ స్థానం పొందిన విద్యార్థిని ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొంటుందని తెలిపారు.
కాంప్లెక్స్ సమావేశాలకు హాజరు కావాలి
కడప ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా ప్రతి మూడవ శనివారం నిర్వహించే కాంప్లెక్స్ సమావేశాలకు ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ ప్రేమంత కుమార్ ఆదేశించారు. కడప నగరంలోని నగరపాలక ఉన్నత పాఠశాల మెయిన్‌లో శనివారం ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ కాంప్లెక్స్ సమావేశాలను ఆయన తనిఖీ చేశారు. ముందుగా ఈయన కాంప్లెక్స్ సమావేశాలు జరుగుతున్న తరగతి గదిలో ఉపాధ్యాయుల మధ్య జరుగుతున్న బోధనాభ్యాసన చర్చా విషయాలను పరిశీలించారు. సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు రమణమూర్తి, నరసింహరాజు, హెచ్‌ఎం ముబీన రెహనా తదితరులు పాల్గొన్నారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి
ఎర్రగుంట్ల : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి భారతి సిమెంట్ ఫ్యాక్టరీ యజమాన్యం నిరంతరం కృషి చేస్తుందని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ చీఫ్ మేనేజర్ ఐఆర్‌పీఆర్ హెచ్‌ఓడీ పేర్ల భార్గవరెడ్డి తెలిపారు. శనివారం తిప్పలూరులోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ సీఎస్‌ఆర్, పెయిడ్ స్వచ్ఛంద సేవ సంస్థల ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పెయిడ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భార్గవరెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ సీఎస్‌ఆర్ హెడ్ నితీశ్వర్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మాజీ సలహదారులు అంబటి కృష్ణారెడ్డి, సంస్థ డైరెక్టర్ చలపతిరావు, ఫ్యాక్టరీ సీఎస్‌ఆర్ వింగ్‌మధన్‌రెడ్డి పాల్గొన్నారు.
గువ్వలచెరువు ఘాట్‌లో రోడ్డు ప్రమాదం
చింతకొమ్మదిన్నె : గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో శనివారం రాత్రి రాయచోటి నుంచి కడప వైపు వస్తున్న నక్షత్ర ట్రావెల్స్ బస్సు బ్రేక్ ఫెయిలైంది. డ్రైవర్ బస్సును అదుపు చేయలేక ముందు వెళుతున్న లారీని ఢీకొన్నాడు. బస్సులోని అయ్యప్ప భక్తులు పదిమందికి, డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ఉన్నారు. వీరంతా శబరిమలలో దర్శనం ముగించుకొని హైదరాబాద్‌కు వెళుతున్నట్లు సమాచారం.
రిమ్స్ మార్చురీలో వ్యక్తి మృతదేహం
రిమ్స్ మార్చురీలో వ్యక్తి మృతదేహం
రిమ్స్ మార్చురీలో వ్యక్తి మృతదేహం
రిమ్స్ మార్చురీలో వ్యక్తి మృతదేహం


