పల్స్ పోలియోను విజయవంతం చేయాలి
కడప రూరల్ : జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఉమామహేశ్వర కుమార్ తెలిపారు. శనివారం స్థానిక ఆ శాఖ జిల్లా కార్యాలయం నుంచి నిర్వహించిన పల్స్ పోలియో ర్యాలీని ప్రారంభించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలను వేయించాలన్నారు. ఇందుకు సంబంధించి పోలియో చుక్కలు ప్రభుత్వ వైద్య కేంద్రాలతోపాటు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్
ఉమామహేశ్వర కుమార్


