
మినీ మహానాడుకు.. పొదుపు సంఘాల మహిళలను తరలించండి
ప్రొద్దుటూరు : తెలుగు దేశం పార్టీకి సంబంధించి ప్రొద్దుటూరులో నిర్వహిస్తున్న మినీ మహానాడును.. ప్రభుత్వ కార్యక్రమంగా అధికారులు భావిస్తున్నారు. మంగళవారం ఉదయం ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులో జరిగే మినీ మహానాడుకు 3 వేల మంది పొదుపు సంఘాల మహిళలను తరలించాలని మున్సిపాలిటీకి చెందిన మెప్మా టీఈ మహాలక్ష్మి ఆర్పీలను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో 30 మంది ఆర్పీలు ఉండగా, ప్రతి ఆర్పీ వంద మందికి తగ్గకుండా మహిళలను మినీ మహానాడుకు తీసుకురావాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహించే కార్యక్రమం కాబట్టి.. విజయవంతం చేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించి మెప్మా టీఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్పీలతో పలు దఫాలుగా చర్చించారు. ఈ చర్చల ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో ఆమె సిబ్బందికి చేసిన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. ఇది ప్రభుత్వ కార్యక్రమమా.. పార్టీ కార్యక్రమమా అని ప్రజలు విస్తుపోయే పరిస్థితి ఏర్పడింది.
మెప్మా టీఈ మహాలక్ష్మి ఆడియో వైరల్

మినీ మహానాడుకు.. పొదుపు సంఘాల మహిళలను తరలించండి