
ఏపీఆర్‌జేసీ, పాలిసెట్ ఫలితాల్లో విశ్వం విజయకేతనం
తిరుపతి ఎడ్యుకేషన్ : ఏపీఆర్‌జేసీ, పాలిసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యాసంస్థ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారని ఆ విద్యాసంస్థ అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి తెలిపారు.
ఏప్రిల్ 25న నిర్వహించిన ఏపీఆర్‌జేసీ పరీక్షా ఫలితాల్లో వై.దేదీప్య రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు, కె.మునిరూపేష్ 7వ ర్యాంకు, జె.అంజలి 9వ ర్యాంకు, మనీషా 10వ ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. వీరితో పాటు రేవంత్, అబ్దుల్ ఖాదర్, యోగి, సమత, భవ్యశ్రీ గీతిక, రోషన్, ట్వింకిల్, సంతోష్, భువన, కార్తికేయ తదితరులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. అలాగే పాలిసెట్ ఫలితాల్లో ఎం.కావ్య 120 మార్కులకు 117 మార్కులు సాధించి బాలికల విభాగంలో జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకును సాధించినట్లు తెలిపారు. అలాగే కిమ్యశ్రీ 116, కె.నిత్యశ్రీ 114, అబ్దుల్ ఖాదర్ 113, సుజినిరెడ్డి, చాతుర్య, రాజకుమారీలు 112, ఎన్.రోషన్ 111, చేతన్‌రెడ్డి 110, జస్మిత 109 మార్కులతో జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆ విద్యాసంస్థ అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్‌రెడ్డి, కరస్పాండెంట్ తులసీ విశ్వనాథరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.