పీజీఆర్‌ఎస్‌కు 149 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు 149 ఫిర్యాదులు

May 13 2025 2:47 AM | Updated on May 13 2025 2:47 AM

పీజీఆ

పీజీఆర్‌ఎస్‌కు 149 ఫిర్యాదులు

కడప అర్బన్‌ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు వచ్చిన ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని ఎస్పీ ఈ.జి అశోక్‌ కుమార్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని పెన్నార్‌ పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. మొత్తం 149 పిటిషన్లు అందా యని పోలీసు అధికారులు వెల్లడించారు. జిల్లా నలు మూలల నుంచి విచ్చేసిన ప్రజలతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్‌ చేసి చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డి.టి.సి డి.ఎస్పీ అబ్దుల్‌ కరీం, మహిళా పి.ఎస్‌ డి.ఎస్పీ బాలస్వామి రెడ్డి పాల్గొన్నారు.

వైభవంగా పల్లకీ సేవ

రాయచోటి టౌన్‌ : రాయచోటి శ్రీ భధ్రకాళీ సమేతుడికి పల్లకీ సేవ నిర్వహించారు. సోమవారం రాత్రి ప్రధాన అర్చకులు మూల విరాట్లకు అభిషేకాలు, పూజలు జరిపారు. అనంతరం ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, రంగు రంగుల పూలతో అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఈవో డీవీ రమణారెడ్డి, స్థానికులతో పాటు కన్నడ భక్తులు పాల్గొన్నారు. వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఘనంగా నల్లగంగమ్మ తిరునాల

సంబేపల్లె : మండల కేంద్రంలోని శ్రీ దేవరరాయ నల్లగంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మొలకలపౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని వేపాకులతో శుద్ధిచేసి పచ్చని తోరణాలు, వివిధరకాల పుస్పాలతో అంకరించారు. ప్రతి ఏడాది మొలకల పౌర్ణమి రోజున అమ్మవారి తిరునాల నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం నుంచి అమ్మవారికి హోమాలు అర్చనలు చేశారు.

24 గంటలు మెరుగైన విద్యుత్‌

– మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి

రాయచోటి: ఆర్‌డీఎస్‌ స్కీమ్‌ ద్వారా గ్రామాలలో 24 గంటలు మెరుగైన విద్యుత్‌ ఇవ్వనున్నట్లు రాష్ట్ర రవాణా,యువజన క్రీడాశాఖమంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంత్రి, జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌తో కలిసి ఆర్డీఎస్‌ స్కీమ్‌పై ఏపీఎస్పీడీసీఎల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఆర్డీఎస్‌ స్కీమ్‌ ద్వారా త్రీఫేస్‌ కనెక్షన్‌ ఇచ్చి 24 గంటలు మెరుగైన విద్యుత్‌ సరఫరా చేయనున్నట్లు వివరించారు.జిల్లాలో జరుగుతున్న ఆర్డీఎస్‌ స్కీమ్‌ త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.

పీజీఆర్‌ఎస్‌కు  149 ఫిర్యాదులు 1
1/1

పీజీఆర్‌ఎస్‌కు 149 ఫిర్యాదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement