
‘మహానాడు’ వేదిక వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన
కడప అర్బన్ : ఈ నెల 27, 28, 29వతేదీలలో సికె.న్నె పరిధిలోని పబ్బాపురంలో జరగనున్న ‘మహానాడు’ వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లను కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్, కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లా ఎస్పీలు ఈజీ.అశోక్‌కుమార్, వి.విద్యాసాగర్‌నాయుడు, అధిరాజ్‌సింగ్‌రాణా బుధవారం పరిశీలించారు. పార్కింగ్ ప్రదేశాలు, ప్రధాన వేదిక, ఫుడ్ కోర్ట్ ల వద్ద చేపట్టాల్సిన బందోబస్తుపై సిబ్బందికి డీఐజీ దిశా నిర్దేశం చేశారు. అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని పోలీస్ అధికారులకు సూచించారు. ‘మహానాడు’ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
రేషన్ బియ్యం స్వాధీనం
దువ్వూరు : మండలంలోని పెద్ద జొన్నవరంలోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 28 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రొద్దుటూరు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మల్లికార్జున తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యం 17.5 క్వింటాళ్లు ఉంటాయని, వాటి విలువ రూ.79,542 ఉంటుందన్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించామన్నారు. డీటీ మల్లికార్జున ఫిర్యాదు మేరకు రేషన్ బియ్యం నిల్వ ఉంచిన కొండా శేఖర్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు దువ్వూరు ఎస్‌ఐ వినోద్ కుమార్ తెలిపారు.

‘మహానాడు’ వేదిక వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన