
రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు
వల్లూరు : మండలంలోని కొప్పోలు బస్టాపు సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు... పిఠాపురానికి చెందిన కూలీలు కుమారునిపల్లె సమీపంలో ని ఇటుకల బట్టీల వద్ద పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి వల్లూరు బస్టాపు వద్దకు భోజనానికి వెళుతుండగా.. కొప్పో లు బస్టాపు సమీపంలో ద్విచక్ర వాహనం ఢీకొంది. ప్రమాదంలో కూలీల్లో ఒకరైన చరణ్ గాయపడ్డాడు. అదుపు త ప్పి కింద పడడంతో వాహనదారుడికి గాయాలయ్యాయి. 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.