
కమనీయం.. చెన్నకేశవస్వామి కల్యాణం
రాజుపాళెం : వెల్లాల పుణ్యక్షేత్రంలోని శ్రీచెన్నకేశవ, సంజీవరాయ, భీమలింగేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీచెన్నకేశవస్వాముల కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీచెన్నకేశవ, సంజీవరాయ స్వాములకు ఉదయం విశేష అభిషేకాలు, అర్చనలు వేద పండితులు నిర్వహించారు. సంజీవరాయ కల్యాణ మండపంలో ఉత్సవమూర్తులకు నూతన పట్టువస్త్రాలు, రంగురంగుల పూలు, పుత్తడి ఆభరణాలతో అలంకరించారు. అనంతరం కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి కల్యాణోత్సవాన్ని తిలకించి, తరించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వెంకటరమణ, ఉత్సవ కమిటీ సభ్యులు లక్ష్మినారాయణరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

కమనీయం.. చెన్నకేశవస్వామి కల్యాణం