
● గాలి వాన బీభత్సం
చక్రాయపేట : మండలంలోని కె.ఎర్రగుడి, కల్లూరుపల్లె గ్రామాల్లో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో మామిడి తోటల్లో చెట్ల కొమ్మలు విరిగిపడగా మరి కొన్ని చెట్లు వేర్లతో సహా లేచి పడ్డాయి. కాయలు కూడా రాలిపోయాయని జగదీశ్వరరెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు వంద ఎకరాల్లో నష్టం జరిగి ఉంటుందని ఆయన వివరించారు. కాయలు కోతకు వస్తున్న సమయంలో విపరీతమైన గాలి వచ్చి రైతులను తీవ్ర నష్టాలకు గురి చేసిందని వాపోయారు. నష్టపోయిన తమను ఆదుకోవాలని మామిడి రైతులు వేడుకుంటున్నారు.

● గాలి వాన బీభత్సం