గోడ కూలి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గోడ కూలి వ్యక్తి మృతి

Mar 24 2025 5:57 AM | Updated on Mar 24 2025 10:00 PM

గోడ క

గోడ కూలి వ్యక్తి మృతి

లింగాల : లింగాల మండలం ఎగువపల్లె గ్రామంలో శనివారం రాత్రి గోడ కూలి దిబ్బెల రామచంద్రారెడ్డి(65) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలలోకి వెళితే.. రామచంద్రారెడ్డి కొత్త ఇంటిని నిర్మించుకునేందుకు పాత ఇంటిని తొలగించే పనులు చేపట్టాడు. జేసీబీతో పాత ఇంటిని తొలగించి వాటి రాళ్లను ట్రాక్టర్‌కు లోడు చేస్తుండగా రామచంద్రారెడ్డి బాత్రూం గోడ పక్కనే ఉన్నాడు. ట్రాక్టర్‌ రివర్స్‌ రావడంతో బాత్రూం గోడకు తగిలి గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. కూలిన గోడ రామచంద్రారెడ్డి పైన పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను వెంటనే పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం కడపకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కడపకు తీసుకెళుతుండగా మృతి చెందినట్లు కడప వైద్యులు నిర్ధారించారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య సులోచనమ్మ, కొడుకు భాస్కర్‌రెడ్డి, కోడలు సునీత, కుమార్తె కుమారి ఉన్నారు. కుటుంబ పెద్ద చనిపోవడంతో ఇంటిల్లిపాది కన్నీటి పర్యంతమవుతున్నారు.

అమరుల స్ఫూర్తితో పోరాడాలి

కడప ఎడ్యుకేషన్‌ : భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ లాంటి అమర వీరుల స్ఫూర్తితో విద్య, వైద్య, ఉపాధి హక్కుల కోసం పోరాటం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం కోటిరెడ్డి సర్కిల్‌లో ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌లకు నివాళిగా కాగడాల ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఆయన హాజరై మాట్లాడుతూ త్యాగధనుల స్ఫూర్తితో సంపాదించుకున్న హక్కులను, ఆస్తులను, ప్రజాధనాన్ని బీజేపీ

కార్పొరేట్‌ మిత్రులకు తాకట్టు పెడుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.వలరాజు, అకిరానంద్‌ , తేజ, శరత్‌, ప్రభాకర్‌, వెంకటశివ, బాదుల్లా తదితరులు పాల్గొన్నారు.

వడ్డీ వ్యాపారి వేధింపులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కడప అర్బన్‌ : చింతకొమ్మదిన్నె పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భాకరాపేట (విశ్వనాథపురం)లో నివాసం ఉంటున్న గంగాధర్‌ (40) అనే వ్యక్తి ఓ వడ్డీవ్యాపారి వేధింపులను భరించలేక ఆదివారం విష ద్రావణం తాగి ఆత్మహత్యకు యత్ని ంచాడు. తాను ఇవ్వాల్సిన బాకీ కంటే పదిరెట్లు వడ్డీగా చెల్లించినా, ఇంకా డబ్బులను ఇవ్వాలని వేధింపులకు గురి చేస్తుండటంతో ఈ చర్యకు పాల్పడ్డాడని అతని భార్య, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాధితుడు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

గోడ కూలి వ్యక్తి మృతి
1
1/2

గోడ కూలి వ్యక్తి మృతి

గోడ కూలి వ్యక్తి మృతి
2
2/2

గోడ కూలి వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement