కడప రైతు బజారు
కడప అర్బన్/ కోటిరెడ్డిసర్కిల్: ప్రతి ఒక్కరూ ఉద యం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు నిత్యావసర సరుకులు, వస్తు సామగ్రి కొనుగోలు చేయాలన్నా.. వినియోగించుకోవాలన్నా ఒక్క క్షణం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ వస్తువు ఎక్కడ కల్తీ జరుగుతుందో, ఎక్కడ నాణ్యత లోపించిందో కనిపెట్టలేని దుస్థితి. నిత్యం ఉపయోగించే పాలు, పెరుగు, కూరగాయలు, గ్యాస్ సిలిండర్లు, వాహనాలకు ఉపయోగించే పెట్రోలు, డీజిల్, మాంసంగా వినియోగించే చికెన్, మటన్, చేపలు, కోళ్లు తదితర వాటి గురించి తెలుసుకుని కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఏ వస్తువు కొందామన్నా అధిక ధరలైనా ఉంటాయి.. లేదంటే నాణ్యతా లోపం ఉంటుంది. పై వాటిల్లో ఏ వస్తువు వినియోగించినా ఆరోగ్యంగా ఉంటామన్న గ్యారంటీ కూడా లేదు. ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవేళ తెలుసుకుని ఫిర్యాదు చేసినా, రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి తమతోపాటు నడిస్తేనే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని అఽధికారులు చెబుతుండటం గమనార్హం. దీంతో తమకెందుకులే అనుకుంటూ ‘ఏదో కొంటున్నాం.. తింటున్నాం’ అని వినియోగదారులు కాలం గడిపేస్తున్నారు.
రైతు బజారులో..
ఉదయం రైతు బజారుకు వెళితే అక్కడ తూనికలు, కొలతలు శాఖ వారు నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఎలక్ట్రానిక్ యంత్రాలు ఉన్నప్పటికీ.. వాటిని సరిచేయడంలో లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కూరగాయలు కొనే వినియోగదారులు ఎవరికీ ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి. ఆకుకూరలు, కూరగాయలు నాణ్యతా ప్రమాణాలు లేకపోయినప్పటికీ అవసరానికి వినియోగదారులు తీసుకు వెళుతుండడం గమనార్హం. రైతు బజారులో 128 దుకాణాలు లైసెన్స్ కలిగి ఉంటే.. ఆ మేరకు దుకాణాలు కూడా ఉన్నాయి. అయితే ఈ దుకాణాల నిర్వాహకులు మాత్రం అధికంగా దళారులే ఉన్నా రు. వీరిలో కేవలం 10 శాతం, అంత కంటే తక్కువగా రైతులు ఉన్నారు. ఏరోజుకారోజు ధరల పట్టికను ప్రదర్శించాల్సిన అవసరం అక్కడున్న ప్రతి దుకాణదారుడికి ఉంది. కానీ, కొన్ని చోట్ల ఈ ధరల పట్టికను ప్రదర్శించకపోవడం గమనార్హం. నిర్దేశించిన ధరల పట్టికల కింద రైతు బజారు ఇన్‌స్పెక్టర్ సంతకం ఉండాలి. కానీ అవేమీ అక్కడ కనిపించలేదు. రైతు బజారు బయటి వైపున ఓ దుకాణంలో నిబంధనలకు విరుద్ధంగా కంజు పిట్టలను పెంచుతూ యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. కంజు పిట్టలను విక్రయించడం నిబంధనల మేరకు ఉందా? అని అటవీశాఖ అధికారులను ప్రశ్నించగా, వారు మాత్రం బాయిలర్ కోళ్ల ఫారం మాదిరిగా పెంచుకుంటే సరే కానీ, అడవిలో నుంచి తీసుకొచ్చి పెంచే నిబంధన లేదన్నారు. అలా ఎవరైనా చట్ట వ్యతిరేకంగా కంజు పిట్టలను పెంచి విక్రయిస్తే తమ దృష్టికి తీసుకు రా వాలన్నారు. అలాగే చేపల దుకాణం వద్ద ఐస్‌బాక్సులలో చేపలను పెట్టి విక్రయిస్తున్నారు. ఆ చేపలు తాజాగా తీసుకొచ్చి పెట్టారా? లేక రెండు లేదా మూడు రోజుల నుంచి అలాగే ఉంచారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
వినియోగదారుడు ‘మేలు’కొనాలి. వస్తువుల ధర, పరిమాణం, తయారీ, తేదీ, తయారీ కంపెనీ అడ్రస్ వంటివి చూసుకోవాలి. అలాగే బిల్లు పొందాలి.
● జిల్లాలో వినియోగదారుల హ క్కులను సంరక్షించేందుకు వివిధ శాఖల వారు తమకు వచ్చిన ఫిర్యాదుల మేరకు న్యాయం చేసేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నారు.
● జిల్లా కేంద్రమైన కడపలో పాత కలెక్టరేట్ ఆవరణలో వున్న వినియోగదారుల ఫోరం 1993 నవంబర్‌లో ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపుగా 8 వేలకుపైగా ఫిర్యాదులు అందాయి. గతేడాది 120 ఫిర్యాదులు, ఈ ఏడాది 30 ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటి వరకు 170 ఫిర్యాదులకు సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
● జిల్లాలో వినియోగదారుల హక్కులను సంరక్షించేందుకు తూనికలు, కొలతలశాఖ వారు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, అగ్రికల్చర్, రెవెన్యూ, ఆహార నాణ్యత, భద్రత విభాగాల అధికారులు, సిబ్బంది తమకు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే వాటిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు. వినియోగదారులలో చాలా మంది తమకు జరిగిన అన్యాయాన్ని వెంటనే రుజువులతో సహా ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతున్నారు. రాత పూర్వకమైన ఫిర్యాదులు బాధితుల ద్వారా అందకపోయినా పై శాఖల వారు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉండటం గమనార్హం.
●మేలుకో.. హక్కులు తెలుసుకో..
ఆర్టీసీ బస్టాండులో..
కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండులో క్యాంటీన్, హోటళ్ల కంటే తినుబండారాలు, కూల్‌డ్రింక్ షాపులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి వాటర్ బాటిల్‌పై ముద్రించిన రేటు రూ. 20–25 ఉంటే రూ.5–10 అధికంగా వసూలు చేస్తున్నారు. చిన్నచిన్న ప్యాకెట్లలో వేరుశనగ, సన్‌ఫ్లవర్, బఠానీలు, ఉప్పు శనగలను లోకల్ ప్యాకింగ్ చేసి, ఎలాంటి ఆహార భద్రతా ప్రమాణాలను పాటించకుండా ప్రయాణికులకు విక్రయించేస్తున్నారు. ఓ వ్యక్తి తన భార్య, కుమార్తెను బస్సు ఎక్కించేందుకు వచ్చిన సమయంలో బిందు అనే పెట్ కూల్‌డ్రింక్ బాటిల్‌ను కొనుగోలు చేస్తే.. దానిపై ఉన్న ధరకన్నా రూ.10 అదనంగా తీసుకున్నారు. సమోసాలు తయారు చేసి అలాగే బయట ప్రదర్శించే లాగా పెట్టి అమ్ముతున్నారు. ఆ సమోసాలకు ఈగలు, దోమలు, దుమ్ముధూళి పడినా పట్టించుకోకుండా అమ్మడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే బస్టాండులో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్ల వద్ద ఎంత వసూలు చేసేది నిర్ణయించే ధరల పట్టికను ప్రదర్శించలేదు. ప్రయాణికుల నుంచి ఇష్టానుసారంగా డబ్బులను వసూలు చేస్తున్నారు. పెట్రోలు బంకు వద్ద లీటరు బాటిల్ తీసుకెళ్లి లీటరు పెట్రోలును కొనుగోలు చేస్తే 10–20 ఎంఎల్ వరకు తక్కువగా వచ్చింది. ఇలా ప్రతి లీటరులో 10–20 ఎంఎల్ పెట్రోలును కాజేస్తూ వినియోగదారులను కొందరు పెట్రోలు బంకు యాజమాన్యం నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు.
నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారులు
అధిక ధరకు అమ్మకాలు
నాణ్యతా, ప్రమాణాలు పాటించని వైనం
నష్టపోతున్న వినియోగదారులు
ఫిర్యాదులుంటేనే చర్యలంటున్న అధికారులు
కాసుల దాహంతో వ్యాపారులు చేస్తున్న మోసం.. కళ్లు మూసుకుని
కాసుల దాహంతో వ్యాపారులు చేస్తున్న మోసం.. కళ్లు మూసుకుని
కాసుల దాహంతో వ్యాపారులు చేస్తున్న మోసం.. కళ్లు మూసుకుని
కాసుల దాహంతో వ్యాపారులు చేస్తున్న మోసం.. కళ్లు మూసుకుని
కాసుల దాహంతో వ్యాపారులు చేస్తున్న మోసం.. కళ్లు మూసుకుని
కాసుల దాహంతో వ్యాపారులు చేస్తున్న మోసం.. కళ్లు మూసుకుని
కాసుల దాహంతో వ్యాపారులు చేస్తున్న మోసం.. కళ్లు మూసుకుని
కాసుల దాహంతో వ్యాపారులు చేస్తున్న మోసం.. కళ్లు మూసుకుని
కాసుల దాహంతో వ్యాపారులు చేస్తున్న మోసం.. కళ్లు మూసుకుని