ప్రొద్దుటూరు రూరల్ : న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకూ ప్రభుత్వ బెదిరింపులకు భయపడవద్దని జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గేయానంద్ అన్నారు. మండలంలోని గోపవరం గ్రామంలో పశువైద్య విద్యార్థులు చేస్తున్న నిరవధిక సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశు వైద్యార్థులు అడుగుతున్నది గొంతెమ్మ కోరికలు కాదని, న్యాయమైన డిమాండ్లే అన్నారు. ఒక సాధారణ ఉద్యోగి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ప్రభుత్వ జీఓలో ఉందన్నారు. విద్యార్థులు నిరసన వ్యక్తం చేసే క్రమంలో ప్రభుత్వం నుండి బెదిరింపులు రావడం బాధాకరమన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే రైతులు, ప్రజా, విద్యార్థి, కుల సంఘాలను కలుపుకొని పోరాటం ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల స్టైఫండ్ విషయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో మాట్లాడతానని తెలిపారు. జేవీవీ రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేష్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి, జేవీవీ రాష్ట్ర సమత నాయకురాలు డాక్టర్ ప్రసన్న, సీపీఎం పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాహుల్, డీవైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి విశ్వనాథ్, ఆప్కాస్ పశు వైద్య కళాశాల అధ్యక్షుడు సుబ్బారావు, ఉపాధ్యక్షుడు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గేయానంద్