
ఇసుక క్వారీ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి
ఒంటిమిట్ట : మండల పరిధిలోని గొల్లపల్లి ఇసుక క్వారీ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అతిధి సింగ్ ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని గొల్లపల్లి ఇసుక క్వారీని ఆమె పరిశీలించి మండల రెవెన్యూ అధికారులు, ఇసుక క్వారీ కాంట్రాక్టరు, గ్రామస్తులతో ఇసుక రవాణాకు ఎదరువుతున్న సమస్యలపై చర్చించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఇసుక రవాణాకు పెట్టిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. అలాగే ఇసుక క్వారీలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులకు తెలిసేలా సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. జేసీ వెంట గనులశాఖ కడప జిల్లా డిప్యూటీ డైరెక్టర్ సూర్య, ఒంటిమిట్ట తహసీల్దార్ రమణమ్మ, మండల రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.