
క్షతగాత్రుడు రామ్మోహన్‌ను పరిశీలిస్తున్న సీఐ చాంద్‌బాషా
వైఎస్సార్ : స్థానిక పుల్లయ్యతోటలో నివాసముంటున్న తమ్మిశెట్టి రామ్మోహన్‌పై అల్లుడు వీరాంజనేయులు కత్తితో దాడి చేశాడు. ఆదివారం రామ్మోహన్ భార్య పార్వతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రామ్మోహన్ దగ్గర పనిచేసే బేల్దారితో వీరాంజనేయులు చెల్లెలు వెళ్లిపోయింది. తన మామ రామ్మోహనే వారిద్దరిని జతచేసి పంపించాడని వీరాంజనేయులుకు అనుమానం. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం రామ్మోహన్‌పై అల్లుడు వీరాంజనేయులు కత్తితో దాడికి పాల్పడ్డాడు.
వెంటనే స్థానికులు గమనించి బాధితుడిని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సీఐ చాంద్ బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రుడిని పరిశీలించి, దాడికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.