తాటి ఉత్పత్తులను ప్రోత్సహించాలి
చౌటుప్పల్: నీరా, తాటి, ఈత ఉత్పత్తులను ప్రోత్సహించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం చౌటుప్పల్ పట్టణంలో జరిగిన సంఘం జిల్లా మహాసభలో వారు మాట్లాడారు. గీత వృత్తిలో ఉన్న వారందరికీ కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలని, పెండింగ్ ఎక్స్‌గ్రేషియా నిధులు విడుదల చేయాలని కోరారు. స్వదేశీ వస్తువులు వాడాలని చెబుతున్న కేంద్రం కల్లుగీత వృత్తిని కూడా ప్రోత్సహించాలన్నారు. నవంబర్ చివరిలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర మహాసభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం నాయకులు రాగీరు కిష్టయ్య, మద్దెల రాజయ్య, దూపాటి వెంకటేశ్, బొలగాని జయరాములు, గాజులు ఆంజనేయులు, అశోక్, వెంకటేశ్, లక్ష్మయ్య, బాలరాజు, లింగయ్య, మల్లేశ్, శంకరయ్య, రమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫ కల్లు గీత కార్మిక
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
వెంకటరమణ


