అమరుల త్యాగాలు మరువలేనివి
భువనగిరిటౌన్ : పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి ఏఎస్పీ కె.రాహుల్‌రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం భువనగిరి పట్టణంలో చేపట్టిన సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అమరులైన పోలీసుల సేవలను కొనియాడారు. భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్ ఎం.రమేష్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి, సీఐలు చంద్రబాబు, రమేష్ కుమార్, అర్జునయ్య, ఎస్‌ఐలు మధుసూదన్, లక్ష్మీనారాయణ, అనిల్‌కుమార్, లక్ష్మీనర్సయ్య, నరేష్, జయరాజు, శివశంకర్‌రెడ్డి, సంధ్య, ప్రవీణ్ కుమార్, లక్ష్మణ్ పాల్గొన్నారు.


