పత్తి రైతుకు కపాస్ కష్టాలు
హెల్ప్‌లైన్, టోల్‌ఫ్రీ నంబర్లు
ప్రమాణాలు పాటించాలి
అడ్డగూడూరు: పత్తి కొనుగోళ్లకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తీసుకువచ్చిన నూతన నిబంధనలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దళారుల ప్రమేయాన్ని నివారించేందుకు కొత్తగా కపాస్ కిసాన్ యాప్ తెచ్చింది. సీసీఐలో పత్తి అమ్మాలంటే తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి. అందుకోసం ఆండ్రాయిడ్ ఫోన్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫోన్ నంబర్ ఆధారంగా వచ్చే ఓటీపీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్‌పై రైతులకు వారం రోజులుగా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దళారులకు చెక్ పెట్టడానికి, కొనుగోలు కేంద్రంలో రోజుల తరబడి రైతులు నిరీక్షించకుండా ఉండేందుకు కొత్త విధానం బాగానే ఉన్నప్పటికీ రైతుల్లో అయోమయం నెలకొంది.
ప్రధాన సమస్యలివీ..
పత్తి సాగు చేసిన రైతుల్లో అధికంగా నిరక్షరాస్యులే ఉన్నారు. వీరిలో చాలా మందికి స్మార్ట్‌ఫోన్లు లేవు. ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న రైతులకు వాటి వినియోగంపై సరైన అవగాహన లేదు. దీంతో యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్, రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ చేయలేకపోతున్నారు. ఫలితంగా ఇతరులపై రైతులు ఆధారపడాల్సి వస్తుంది. వ్యవసాయ శాఖ ద్వారా స్లాట్ బుక్ చేసుకునేందుకు వెళ్లినా వారు సమయానికి అందుబాటులో ఉండటం లేదని రైతులు అంటున్నారు.మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్స్ సరిగా రావడం లేదని రైతులు అంటున్నారు. ఫోన్‌లలో ఇంకా యాప్ డౌన్‌లోడ్ చేసుకోలేదని సిగ్నల్స్ అందే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇన్ని గందరగోళ పరిస్థితుల్లో రైతులు మళ్లీ ప్రైవేట్ వ్యాపారులు, దళారులను ఆశ్రయించే అవకాశాలున్నాయి.
కొనుగోళ్లకు ఏర్పాట్లు
పత్తి కొనుగోళ్లకు సీసీఐ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే జిన్నింగ్ మిల్లులను అలాడ్ చేయగా.. సోమవారం (నేడు) నుంచి కొనుగోళ్లు ప్రారంభించనుంది. జిల్లాలో 65,198 మంది రైతులు 1,27,06 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 6 నుంచి 8లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా పత్తి కొనుగోళ్లకు 12 జిన్నింగ్ మిల్లుల్లో సీసీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 8 శాతం తేమ ఉన్న పత్తికి క్వింటాకు రూ.8,110, 12 శాతం ఉన్న ఉన్న పత్తికి క్వింటాకు రూ.7,785 మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కొత్తగా కపాస్ కిసాన్ యాప్ తీసుకువచ్చిన సీసీఐ
ఫ యాప్‌లో స్లాట్ బుక్ చేస్తేనే కొనుగోళ్లు
ఫ రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారులు
ఫ నిరక్షరాస్యత, స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, సిగ్నల్స్ అందక కర్షకుల ఇబ్బందులు
ఫ మరొకరిపై ఆధారపడాల్సిన దైన్యం
ఫ నేటి నుంచి పత్తి కొనుగోళ్లు
పత్తి విక్రయించే రైతుల కోసం సీసీఐ హెల్ప్‌లైన్ 8978978517, టోల్‌ఫ్రీ 8005995779 నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ నంబర్ల ద్వారా సీసీఐ కేంద్రాల వివరాలు, స్లాట్ బుకింగ్ తేదీ, తక్ పట్టి, చెల్లింపులు తదితర అంశాలను రైతులు తెలుసుకునేందుకు వీలుంటుంది.
సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి చేస్తాం. సోమవారం నుంచి కపాస్ కిసాన్ యాప్ అందుబాటులో వస్తుంది. సీసీఐకి పత్తి విక్రయించే రైతులు తప్పనిసరిగా స్లాట్ బుక్ చేసుకోవాలి. నూతన విధానంతో దళారుల ప్రమేయం లేకుండా నేరుగా సీసీఐకి పత్తి అమ్ముకోవచ్చు. రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన పత్తి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలి.
–వెంకటరమణారెడ్డి,
జిల్లా వ్యవసాయ అధికారి
పత్తి రైతుకు కపాస్ కష్టాలు
పత్తి రైతుకు కపాస్ కష్టాలు
పత్తి రైతుకు కపాస్ కష్టాలు


