వలస కూలీలపై ఫోకస్
భువనగిరిలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న తనిఖీలు
భువనగిరిటౌన్ : జిల్లా కేంద్రంలో ఇటీవల పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి ఒకరికి రూ.12 వేల నగదు ఇచ్చి తనకు అకౌంట్‌కు ఫోన్ పే చేయించుకున్నాడు. తీరా చూస్తే అవి దొంగనోట్లుగా తేలాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ చేశారు.
పశ్చిమబెంగాల్‌కు చెందిన మరో వ్యక్తి చైన్ స్నాచింగ్‌కు పాల్పడి పోలీసులకు దొరికిపోయాడు. ఇటువంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వలస కూలీలపై పోలీస్ శాఖ దృష్టి సారించింది.వారు అద్దెకు ఉంటున్న ఇళ్లకు వెళ్లి యజమానులను సంప్రదించి కూలీల వివరాలు సేకరిస్తుంది.
వేలల్లో వలస కార్మికులు
జిల్లాలో వలస కూలీలు నానాటికీ పెరిగిపోతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వలస కార్మికులు భువనగిరి, బీబీనగర్, చౌటుప్పల్‌తో పాటు ఆయా మండల కేంద్రాల్లో నివాసం ఉంటూ పరిశ్రమలు, దుకాణాలు, హోటళ్లు, ఇటుకబట్టీలు, గృహ నిర్మాణ పనులు చేస్తున్నారు.
జిల్లా కేంద్రంలో అధికంగా..
పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల్లో ఎక్కువగా జిల్లా కేంద్రంలో తిష్టవేశారు. అనధికార లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా సుమారు 30వేల మంది వలస కార్మికులు ఉండగా.. వీరిలో భువనగిరి పట్టణంలోనే 10 వేల మంది వరకు ఉంటున్నట్లు తెలిసింది. చాలా కాలనీల్లో ఐదారుగురు కలిసి గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు.
వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు వస్తున్నారు. వారి డేటాను పోలీసుల ఆధీనంలో ఉండాలన్న ఉద్దేశంతో సెర్చ్ చేస్తున్నాం. ఇటీవల చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో వలస కార్మికుల కార్యకలాపాలపై నిఘా పెట్టాం. అందులో భాగంగానే వారి వివరాలు సేకరిస్తున్నాం. ఇక నుంచి పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి భువనగిరికి ఎవరు వచ్చినా పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు నమోదు చేయించుకోవడంతో పాటు బయోమెట్రిక్ వేయాలి.
–రమేష్‌కుమార్, భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడే మకాం
ఫ పలు నేరాల్లో వీరి ప్రమేయం
ఫ అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం
ఫ భువనగిరి పట్టణంలో తనిఖీలు, వివరాల సేకరణ, రికార్డుల్లో నమోదు
ఫ కొత్తగా వచ్చిన కూలీలు పోలీస్‌స్టేషన్‌లో బయోమెట్రిక్ వేయాల్సిందే
భువనగిరిలో పట్టణ ఇన్‌స్పెక్టర్ రమేష్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ నెల 22వ తేదీ నుంచి వలస కూలీల వివరాలు సేకరిస్తున్నారు. పట్టణంలో వివిధ ప్రాతాల్లో నివాసం ఉంటున్న వలస కార్మికుల వద్దకే పోలీసులు వెళ్లి ఒక్కొక్కరిని పిలిచి పేరు, రాష్ట్రం, చేస్తున్న పని, ఇల్లు అద్దెకు ఇప్పించిన వ్యక్తి పేరు రికార్డులో నమోదు చేసుకుంటున్నారు. ఆధార్‌కార్డులను పరిశీలించి నంబర్ రికార్డ్ చేస్తున్నారు. సెల్‌ఫోన్‌లో వారి ఫొటోలను తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఇంటి యజమానులను సైతం ప్రశ్నిస్తున్నారు. ఎవరి చెబితే వలస కార్మికులు ఇల్లు అద్దెకు ఇచ్చారని వివరాలు తీసుకుంటున్నారు.
వలస కూలీలపై ఫోకస్


