నిరుపేదల కళ్లలో వెలుగులు
రామన్నపేట: తల్లితండ్రులను స్ఫూర్తిగా తీసుకొని జన్మభూమి రుణం తీర్చుకోవడానికి పూనుకున్నారు.. మునిపంపులకు చెందిన ఎన్నారై దేవిరెడ్డి పద్మా వీరేందర్‌రెడ్డి దంపతులు. స్వగ్రామంతో 14 పరిసర గ్రామాల ప్రజల కోసం మునిపంపులలో ఉచిత కంటి పొర చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు. కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి చికిత్సలు చేసి వారికి వెలుగులు పంచుతున్నారు.
తల్లిదండ్రుల స్ఫూర్తితో సామాజిక సేవ
దేవిరెడ్డి రామిరెడ్డి 25 ఏళ్లు మునిపంపుల సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన సతీమణి సావిత్రమ్మ కూడా ఏడేళ్లు సర్పంచ్‌గా పనిచేసి గ్రామాభివృద్దికి పాటుపడ్డారు. 80 పదుల వయసులోనూ సావిత్రమ్మ ఇప్పటికీ గ్రామాభివృద్ధికి, పేదవారి బాగోగుల కోసం తాపత్రయ పడుతుంది. వారి కుమారుడు దేవిరెడ్డి వీరేందర్‌రెడ్డి అమెరికాలో స్థిరపడ్డాడు. తల్లిచేతుల మీదుగా పేదలకు, అపన్నులకు సహాయం అంద జేస్తున్నారు.
కంటిపొర చికిత్స శిబిరానికి భారీ స్పందన
కొద్ది రోజుల క్రితం ఊరికి వచ్చిన వీరేందర్‌రెడ్డి–పద్మ దంపతులు ఉచిత కంటిపొర చికిత్స శిబిరం నిర్వహించాలని సంకల్పించారు. తల్లి సావిత్రమ్మతో తమ అభిప్రాయాన్ని గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తులు 50 మందికి వలంటీర్లుగా ఏర్పడి తో డ్పాటునందించారు. వైద్యశిబిరం ఏర్పాటుపై 14 గ్రామాల్లో ప్రచారం చేశారు. గ్రామాల వారీగా తేదీలు నిర్ణయించి టోకెన్లు జారీ చేశారు. ఈనెల 22న నకి రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ హను మంతరావు చేతుల మీదుగా వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. హెదరాబాద్ శంకర్ నేత్రాలయం ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం ఐదు రోజుల్లో 1,200 మందికి నేత్ర పరీక్షల చేసి 914మందికి ఉచితంగా కళ్ల దాలు పంపిణీ చేశారు. 60మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించి.. ఆదివారం మొబైల్ థియేటర్‌లో 24మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించారు. ఈ వైద్యశిబిరం ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఫ ఎన్‌ఆర్‌ఐ చొరవతో మునిపంపులలో ఉచిత కంటిపొర చికిత్స శిబిరం
ఫ ఇళ్ల వద్దకు వెళ్లి ఆపరేషన్లు, ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ
ఫ శంకర్ నేత్రాలయం వారి మొబైల్ థియేటర్‌లో 1,200 మందికి చికిత్స
నిరుపేదల కళ్లలో వెలుగులు


