నేత్రపర్వంగా తిరునక్షత్ర వేడుకలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీమణవాళ మహాముని తిరునక్షత్ర వేడుకలను ఆదివారం నేత్రపర్వంగా చేపట్టారు. ఉదయం స్నపన తిరుమంజన అభిషేకం, సేవా కాలాన్ని ఘనంగా నిర్వహించారు. రాత్రి పురఫ్ఫాట్ సేవ జరిపించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆల య ముఖ మండపంలో సేవాకాలం జరిపించి, ప్రబంధ పారాయణాలను పఠించారు.
మోటకొండూరుకు నేడు మంత్రుల రాక
మోటకొండూర్: రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం మోటకొండూర్‌కు రానున్నారు. తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. అనంత రం బహిరంగ సభలో మంత్రులు ప్రసంగిస్తారు. ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్యరెడ్డి, పచ్చిమట్ల మదార్‌గౌడ్, నెమ్మాణి సుబ్రహ్మణ్యం, కొంతం మోహన్‌రెడ్డి, భాస్కరుణి రఘునాథరాజు, తహసీల్దార్ నాగదివ్య, భూమండ్ల శ్రీనివాస్, బాల్ద సిద్ధులు, సీఐ శంకర్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని తహసీల్దార్ పరిశీలన చేస్తుండగా ఎమ్మార్పీఎస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తమ భూములు అంటూ వాగ్వాదానికి దిగారు. ఎస్సీల భూములు తీసుకోబోమని, ఇది ఎస్సీలది అయితే పక్కన అంతే భూమి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వారికి హామీ ఇచ్చారు.
స్వర్ణగిరీశుడికి తిరువీధి సేవ
భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో అదివారం సాయంత్రం శ్రీవేంకటేశ్వర స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవ కనుల పండువగా నిర్వహించారు.అంతకు ముందు ఉదయం ఆలయంలో స్వామివారికి సుభ్రబాత సేవ, తోమాలసేవ, సహస్రనామార్చన సేవ, నిత్యకల్యాణం, దామోదర హవనం, సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు.
చేనేత కళ భేష్
చౌటుప్పల్ రూరల్: ప్రాచీన హస్తకళలు, ప్రకృతి రంగులతో చేనేత వస్త్రాలు తయారీ చేయడం అభినందనీయమని నార్వే దేశస్తుడు లాస్ నీల్సన్ అన్నారు. చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెంలో చేనేత వస్త్రాలు తయారు చేసే విధానం, దండుమల్కాపురం టెక్స్‌టైల్ పార్క్‌లో వస్త్రాల తయారీని ఆదివారం పరిశీలించారు. కొయ్యలగూడెంలో జాతీయ పురస్కార గ్రహీత దుద్యాల శంకర్ ఇంటిని సందర్శించారు.మగ్గంపై వస్త్రాలను నేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. వెదురుతో ఇళ్లు నిర్మించడంతో పాటు కళాకారుడు శ్రవణ్ వివిధ రకాలుగా తయారు చేసిన వస్తువులను పరిశీలించారు.
నేత్రపర్వంగా తిరునక్షత్ర వేడుకలు
నేత్రపర్వంగా తిరునక్షత్ర వేడుకలు


