లక్కు ఎవరికో?
భువనగిరి: మద్యం దుకాణాలకు సోమవారం డ్రా తీయనున్నారు. ఇందుకోసం భువనగిరి మండలం రాయగిరిలోని సోమరాధాకృష్ణ ఫంక్షన్ హాల్‌లో ఎకై ్సజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 2,766 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా చౌటుప్పల్ మండలంలోని ఎల్లంబావి షాపునకు 91, కని ష్టంగా మోటకొండూరులోని వైన్స్‌కు 18మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా.. అదృష్టం ఎవరిని వ రించనుందోనని దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఎంట్రీపాస్ ఉంటేనే అనుమతి
కలెక్టర్ సమక్షంలో డ్రా తీయనున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఎంట్రీ పాస్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించనున్నారు. ఫంక్షన్ హాల్‌లోకి ఫోన్ అనుమతి లేదు. మొదట భువనగిరి, తర్వాత రామన్నపేట, ఆలేరు, మోత్కూర్ సర్కిళ్ల పరిధిలోని వైన్స్‌లకు డ్రా తీయనున్నారు. ఉదయం 11 గంటలకు డ్రా ప్రారంభం కానుందని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి తెలిపారు. కార్యక్రమం సాఫీగా ముగిసేందుకు దరఖాస్తుదారులు సహకరించాలని కోరారు.
ఫ నేడు మద్యం దుకాణాలకు డ్రా
ఫ సోమరాధాకృష్ణ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాట్లు


