రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ జూడో పోటీలకు ఎంపిక
మోత్కూరు: మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ ఆవరణలో నిర్వహించిన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–14, అండర్–17 బాలబాలికల జూడో పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల్లో పలువురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు జూడో కోచ్ అన్నెపు వెంకట్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అండర్–14(44 కేజీల) విభాగంలో కె. నిధి, 50 కేజీల విభాగంలో ఎ. సాయిసృజిత్ చంద్ర, అండర్–17(36 కేజీల) విభాగంలో ఎం. విమలశ్రీ, 52 కేజీల విభాగంలో ఎం. సాక్షి, 45 కేజీల విభాగంలో ఎస్‌కే పరహాన్, 50 కేజీల విభాగంలో పి. అర్జున్, 55 కేజీల విభాగంలో అవినాష్, 40 కేజీల విభాగంలో ఎ. రాకేష్ ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. గెలుపొందిన విద్యార్థులను ఇన్‌స్పెక్టర్ కె. వెంకటేశ్వర్లు, ఎంఈఓ గోపాల్‌రెడ్డి, స్కూల్ గేమ్స్ జిల్లా సెక్రెటరీ దశరథరెడ్డి అభినందించారు.
ఉరేసుకుని ఆత్మహత్య
రాజాపేట: ఇంట్లో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజాపేట మండలం కొండ్రెడ్డిచెర్వు గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండ్రెడ్డిచెర్వు గ్రామానికి చెందిన కర్రె కనకయ్య మొదటి భార్య 13 సంవత్సరాల క్రితం మృతిచెందింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భార్య మృతిచెందిన తర్వాత కనకయ్య లలిత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి అక్షిత్ అనే కుమారుడు ఉన్నాడు. కాగా కనకయ్య తల్లి పెంటమ్మ అనారోగ్యానికి గురికావడంతో నాలుగు రోజుల క్రితం చికిత్స నిమ్తితం ఆమెను గజ్వేల్ సమీపంలోని ఆర్వీఎం ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో నాయనమ్మ వద్ద ఉన్న కనకయ్య మొదటి భార్య కుమారుడు కర్రె మహేష్(22) మంగళవారం రాత్రి ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. మహేష్‌ను అన్నం తినమని కనకయ్య రెండో భార్య లలిత చెప్పగా సరే అంటూ ఇంట్లోకి వెళ్లాడు. బుధవారం ఉదయం అతని గది తెరిచి చూసేసరికి చున్నీతో ఉరేసుకుని కనిపించాడు. దీంతో లలిత భర్త కనకయ్యకు విషయం చెప్పింది. మహేష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు.


