అన్ని రాష్ట్రాల్లోనూ నిరుద్యోగ సమస్య
సూర్యాపేట: దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ గ్రామీణ యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటుందని, ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడం అందరికీ ఆవేదన కలిగించే విషయమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం 20 నెలల కాలంలో 75వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు. ఇటీవల గ్రూప్–1, గ్రూప్–2 అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడమే కాకుండా లైసెన్స్‌డ్ సర్వేయర్లకు లైసెన్స్‌లు ఇచ్చామన్నారు. ప్రైవేటు రంగంలోనూ ఎక్కువ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని దేశ విదేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో సింగరేణి కాలరీస్, డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ సహకారంతో హుజూర్‌నగర్‌లో ఈనెల 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, చెవిటి వెంకన్నయాదవ్, కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్, చింతల లక్ష్మీనారాయణరెడ్డి, చకిలం రాజేశ్వరరావు పాల్గొన్నారు.
ఫ 20 నెలల కాలంలోనే 75వేల
మందికి ఉద్యోగ అవకాశాలు
ఫ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


