యాదగిరీశుడికి శతఘటాభిషేకం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకొని బుధవారం ఉదయం ఆలయంలో అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. అదేవిధంగా ఆలయ ముఖ మండపంలో స్వాతి హోమం, పంచామృతాలు, శుద్ధ జలాలు, పుష్పాలు, సుగంధ ద్రవ్యాలతో నింపిన బంగారు, వెండి కలశాలకు ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలకారమూర్తులకు అష్టోతర శతఘటాభిషేకం చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో నిత్య పూజలు కొనసాగాయి. స్వాతి నక్షత్రం పురస్కరించుకొని కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం 5గంటలకు ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు, భక్తులు, ఆలయ ఉద్యోగులు, అర్చకులు, స్థానికులు పాల్గొన్నారు.
ఫ గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు
యాదగిరీశుడికి శతఘటాభిషేకం


