షార్ట్ సర్క్యూట్‌తో సెలూన్ షాపు దగ్ధం
ఆలేరు: షార్ట్ సర్క్యూట్‌తో సెలూన్ షాపులో ఫర్నిచర్ దగ్ధమైంది. ఈ ఘటన ఆలేరు పట్టణంలో మంగళవారం రాత్రి జరిగింది. బుధవారం ఆలేరు ఎస్‌ఐ వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామానికి చెందిన బొప్పాపురం కిష్టయ్య ఆలేరు పట్టణంలోని వేణు కాంప్లెక్స్ మొదటి అంతస్తులో ప్రిన్స్ హెయిర్ సెలూన్ షాపు నడుపుతున్నాడు. మంగళవారం సాయంత్రం దుకాణాన్ని మూసివేసి యాదగిరిగుట్టకు వెళ్లాడు. రాత్రి సుమారు 10.30గంటల సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు సెలూన్ షాపు నుంచి పొగలు రావడాన్ని గమనింంచారు. షాపు యజమానికి పోలీసులు ఫోన్ చేయగా.. షాపు పక్కన గదిలో ఉంటున్న వారి వద్ద తాళం ఉందని చెప్పాడు. పోలీసులు షాపు తెరిచి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. షాపులోని కుర్చీలు, ఫర్నిచర్ దగ్ధం కాగా.. సుమారు రూ.5లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు యజమాని చెప్పాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆలేరు పట్టణ అధ్యక్షుడు ఇజాజ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఫోన్‌లో విషయం వివరించగా.. బాధితుడి మాట్లాడిన ఎమ్మెల్యే ప్రభుత్వ తరపున సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.


