ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
నకిరేకల్: ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. నకిరేకల్‌లోని చీమలగడ్డలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి 20రోజులు అవుతున్నా తేమ శాతం పేరుతో కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు. కొనుగోళ్లలో జాప్యం జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం మిల్లర్లను సమన్వయం చేస్తూ ముందుకు సాగాలని అన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పల్‌రెడ్డి మహేందర్‌రెడ్డి, నాయకులు గోర్ల వీరయ్య, సిలివేరు ప్రభాకర్, రాచకొండ శ్రవణ్, గుర్రం గణేష్, ఇమడపాక వెంకన్న, పేర్ల కృష్ణకాంత్, గోనె నర్సింహారావు, చెట్టిపల్లి జానయ్య, దైద పరమేశం, మాద నగేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య


