యాదగిరిగుట్టలో ధనలక్ష్మి పూజ
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ధనలక్ష్మి పూజను అర్చకులు వైభవంగా నిర్వహించారు. సోమవారం రాత్రి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, అనంతరం ముఖ మండపంలో అధిష్టించారు. ఈ సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి ధనలక్ష్మి పూజను చేశారు. ఉదయం ఆలయంలో స్వామి, అమ్మవార్లకు మంగళహారతి పూజ జరిపి, గర్భాలయ ప్రధాన ద్వారం వద్ద దీపావళి వేడుకల్లో భాగంగా క్రాకర్స్‌తో పాటు దీపాలు వెలిగించి వేడుకను నిర్వహించారు. ఆయా వేడుకలో అధికారులు, అర్చకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
బుద్ధవనంలో
ధమ్మ దీపోత్సవం
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో దీపావళిని పండుగను పురస్కరించుకొని సోమవారం బౌద్ధులు ధమ్మ దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సిద్దార్ధుడు జ్ఞానోదయం పొంది మొదటిసారి కపిలవస్తు నగరానికి వచ్చిన సమయంలో ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికిన సందర్భాన్ని బౌద్ధులు, బౌద్ధ అభిమానులు దీపోత్సవం, దీపదానోత్సవం అని ఘనంగా జరుపుకుంటారు. ప్రతిఏటా దీపావళి రోజున బౌద్ధులు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దీపోత్సవం సందర్భంగా బుద్ధవనంలోని మహాస్థూపాన్ని, వివిధ భాగాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. బుద్ధవనంలోని అశోక చక్రం వద్ద దీపాలు వెలిగించి దీపాలతో మహాస్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, సాక్షి పత్రిక మాజీ ఎడిటర్ రామచంద్రమూర్తి, బౌద్ధ అభిమానులు పాల్గొన్నారు.
గల్లంతైన వ్యక్తి
మృతదేహం లభ్యం
పెద్దఅడిశర్లపల్లి: ఏఎమ్మార్పీ కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని చంచల్‌గూడకు చెందిన సయ్యద్ హర్షద్(45) ఆదివారం తన స్నేహితులతో కలిసి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజార్వాయర్ హెడ్ రెగ్యూలేటర్ వద్ద గల ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ వద్ద చేపల వేటకు వచ్చాడు. ప్రమాదవశాత్తు కాలు జారిపడి కాలువలో గల్లంతయ్యా డు. సమాచారం తెలుసుకున్న గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నీటి సరఫరాను నిలిపివేసి గాలింపు చర్యలు చేపట్టగా.. ప్రధాన కాలువ మెయిన్ గేట్ వద్ద హర్షద్ మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నుట్ల ఎస్‌ఐ తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
దేవరకొండ: దేవరకొండ పట్టణంలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సీఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకా రం.. దేవరకొండ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద సుమారు 55ఏళ్ల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు లేత గోధుమ రంగు టీషర్ట్, పొడగాటి జుట్టు కల్గి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712670154, 8712570236 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు.
యాదగిరిగుట్టలో ధనలక్ష్మి పూజ


