3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
భూదాన్‌పోచంపల్లి : జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 320 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ సీజన్‌లో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఽకలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మంగళవారం పోచంపల్లి పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ప్రారంభించలేదని, బుధవారం నాటికి అన్ని కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించామన్నారు. మంగళవారం వరకు జిల్లా వ్యాప్తంగా 38 మెట్రిక్ టన్నుల ధాన్యం కాంటా వేశామన్నారు.
పనులు ఆపితే సస్పెండ్ చేస్తా..
పోచంపల్లి పీఏసీఎస్ ఆవరణలో రైతుల విశ్రాంతి కేంద్రాన్ని నిర్మిస్తుంటే జలాల్‌పురం పంచాయతీ కార్యదర్శి నిర్మాణ పనులను నిలిపివేశారని స్థానిక రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ స్పందించి ఎంపీడీఓ భాస్కర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పనులకు ఆటంకం కలిగిస్తే పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. విశ్రాంతి కేంద్రానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నిధులు పెంచాలని పీఏసీఎస్ సీఈఓ బాల్‌రెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ పి.శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, ఏఓ శైలజ, ఏఈఓ శ్వేత పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బంది కలుగకుండా చూస్తాం
రామన్నపేట : ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూస్తామని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. రామన్నపేట మండలంలోని బోగారం, ఇంద్రపాలనగరం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం కలెక్టర్ సందర్శించి రికార్డులను పరిశీలించి మాట్లాడారు. ఇంద్రపాలనగరం పల్లె దవాఖానాను తనిఖీ చేసి రికార్డులు, మందుల స్టాక్‌ను పరిశీలించారు. అనంతరం రామన్నపేట మండల కేంద్రంలోని జంగాల కాలనీలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సి.లాల్‌బహదూర్‌శాస్త్రి, ఎంపీడీఓ ఎ.రాములు ఏపీఎం జానిమియా, మార్కెట్ డైరెక్టర్ వెంకటేశం ఉన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు


