వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తాం
చౌటుప్పల్ : విద్యుత్ వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ట్రాన్స్‌కో రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి, జిల్లా ఎస్‌ఈ సుధీర్‌కుమార్ తెలిపారు. సీఎండీ ఆదేశాల మేరకు మంగళవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వినియోగదారుల సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతరాయం కలుగకుండా అన్నిరకాల వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో చౌటుప్పల్ డీఈ మల్లికార్జున, ఏడీఈ పద్మ, ఏఈ రాజుల సతీష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


