
సూక్ష్మ సైజులో అమరవీరుల స్థూపం
భువనగిరి: భువనగిరి పట్టణానికి చెందిన స్వర్ణకారుడు చోల్లేటి శ్రీనివాసచారి ఈ నెల 21న పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సూక్ష్మ సైజులో పోలీసు అమరవీరుల స్థూపాన్ని తయారు చేశారు. 40 గ్రాముల వెండితో నాలుగు ఇంచుల ఎత్తులో రూపొందించి ఔరా అనిపించారు. ఆయన గతంలోనూ బంగారం, వెండితో వీసా టవర్, క్రికెట్ స్టేడియం, క్రికెట్ వరల్డ్ కప్, భారత పార్లమెంటు భవనం, వీణ, బంగారు బతుకమ్మ, తెలంగాణ చిత్రపటం, ఫుట్‌బాల్ వరల్డ్ కప్, క్రికెట్ బాల్ వంటివి తయారు చేశాడు.
వెండితో తయారు చేసిన
పోలీసు అమరవీరుల స్థూపం

సూక్ష్మ సైజులో అమరవీరుల స్థూపం