నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
నల్లగొండ: ఆటోలో ప్రయాణికురాలు మర్చిపోయిన బ్యాగును పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు ఓ ఆటో డ్రైవర్. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ నుంచి శనివారం ఆటోలో మిర్యాలగూడకు బయల్దేరిన నెమ్మాని సంధ్య తన గమ్యస్థానం రాగానే ఆటోలో ల్యాప్‌టాప్, రూ.1500 నగదు మర్చిపోయి వెళ్లిపోయింది. ఆటో డ్రైవర్ ఎండీ లతీఫ్ బ్యాగును గమనించి నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో వాటిని అప్పగించాడు. పోలీసులు విచారణ చేసి సంధ్యను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఆమెకు ల్యాప్‌టాప్, రూ.1500 నగదు అప్పగించి ఆటో డ్రైవర్ లతీఫ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సైదులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


