ఆబ్కారీ అంచనాలు తలకిందులు
భువనగిరి: నూతన మద్యం దుకాణాల టెండర్లకు ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోటీ తీవ్రంగా ఉంటుందని, దరఖాస్తు ఫీజు రూపంలో భారీగా ఆదాయం సమకూరుతుందని ఆశించిన ఎకై ్సజ్ శాఖ అంచనాలు తలకిందులయ్యాయి. గత ఏడాది 3,900 దరఖాస్తులు రాగా ఈసారి కేవలం 2,541 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గత సంవత్సరంతో పోలిస్తే 1,253 దరఖాస్తులు తగ్గాయి. కాగా 2025–27 సంవత్సరానికి గాను నూతన మద్యం దుకాణాల నిర్వహణకు ఎకై ్సజ్‌శాఖ సెప్టెంబర్ 26న ప్రకటన జారీ చేసింది. అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. శనివారం సాయంత్రం గడువు ముగిసింది.
గతసారి రూ.78.50 కోట్ల ఆదాయం
జిల్లాలోని నాలుగు ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలో 82 మద్యం దుకాణాలు ఉన్నాయి. 2023–24 సంవత్సరంలో 3,900 దరఖాస్తులు రాగా.. వీటి ద్వారా రూ.78.50 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి 2,541 దరఖాస్తులు దాఖలు కాగా రూ.79.41 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఎల్లంబావి వైన్స్‌కు 88 దరఖాస్తులు
అత్యధికంగా చౌటుప్పల్ మండలంలోని ఎల్లంబావి గ్రామ వైన్స్‌కు 88 దరఖాస్తులు వచ్చాయి. ఆ తరువాత మోత్కూరు సర్కిల్ పరిధిలోని అరూర్ వైన్స్‌కు 80, అత్యల్పంగా తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ షాప్‌కు 14 దరఖాస్తులు వచ్చాయి.
23న డ్రా ద్వారా దుకాణాల కేటాయింపు
రాయగిరి పరిధిలోని సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్‌లో ఈనెల 23న కలెక్టర్ సమక్షంలో డ్రా తీసి దుకాణాలు కేటాయించనున్నారు.
దరఖాస్తులు తగ్గడానికి కారణం ఇదేనా?
2023–24లో ఫీజు రూ.2లక్షలు ఉండగా.. ఈసారి రూ.3 లక్షలకు పెంచారు.ఆసక్తి చూపకపోవడానికి ఇదే కారణమని అధికారులు భావిస్తున్నారు.
మద్యం టెండర్లకు తగ్గిన స్పందన
82 షాప్‌లకు 2,647 దరఖాస్తులు
గత ఏడాదితో పోల్చితే 1,253 తక్కువ


