జువైనల్ జస్టిస్ బోర్డుతో సత్వర న్యాయం
భువనగిరిటౌన్ : జువైనల్ జస్టిస్ బోర్డు వల్ల బాల నేరస్తులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు అన్నారు. భువనగిరి కోర్టులో ఏర్పాటు చేసిన జువైనల్ జస్టిస్ బోర్డును శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. బోర్డు ద్వారా కేసుల విచారణ వేగంగా జరుగుతుందన్నారు. బాల నేరస్తులకు శిక్ష విధించడం కాకుండా సత్ప్రవర్తనతో సమాజంలోకి వెళ్లేలా చూస్తామని తెలిపారు. పునరావాసం, ఉపాధి శిక్షణ లభిస్తుందన్నారు. జువైనల్ జస్టిస్ బోర్డు ఇంచార్జ్ న్యాయమూర్తిగా భువనగిరి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ జడ్జి స్వాతి బాధ్యతలు స్వీకరించారు. కాగా మొదటి రోజు 10 కేసులను విచారించినట్లు ఆమె తెలిపారు. ఈకార్యక్రమంలో న్యాయమూర్తులు, ముక్తిద, మాధవిలత, ఉషశ్రీ, శ్యాంసుందర్, సీడబ్ల్యూసీ చైర్మన్ బండారు జయశ్రీ, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన జడ్జి జయరాజు
జువైనల్ జస్టిస్ బోర్డుతో సత్వర న్యాయం


