నృసింహుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సంప్రదాయ పూజలు ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు ప్రధానాలయంలోని స్వయంభూలను సుప్రభాత సేవతో మేల్కొలిపారు. ఆ తర్వాత గర్భాలయంలోని స్వామి, అమ్మవార్లకు అభిషేకం, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు తులసీదళాలతో అర్చించారు. ఇక ముఖమండపంలోని అలంకారమూర్తులకు అష్టోత్తర పూజలు, ప్రాకార మండపంలో సుదర్శన నారసింహా హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు గావించారు. సాయంత్రం వెండి జోడు సేవను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు.


