
నృసింహుడికి లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట: ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఉత్సవమూర్తులకు లక్ష పుష్పార్చన నిర్వహించారు. గులాబీ, చామంతి, బంతి, తులసీ దళంతో స్వామి, అమ్మవారికి పుష్పార్చన చేశారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవోత్సవం తదితర పూజలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. అంతకుముందు తెల్లవారుజామున సుప్రభాత సేవ, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామర్చన జరిపించారు.