
ఆశలు నింపిన డిండి
డిండి: ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దుందుబి వాగు దిగువకు పరవళ్లు తొక్కుతుండడంతో మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి అలుగు పోస్తోంది. వానాకాలం సీజన్‌కుగాను ఆయకట్టులోని ఎడమ కాలువ ద్వారా 12,500 ఎకరాలు, కుడి కాలువ ద్వారా 250 ఎకరాల సాగుకు నీటిని విడుదల చేశారు. గత రెండు నెలలుగా డిండి ప్రాజెక్టు నిండుకుండలా మారి అలుగు పోస్తుండడంతో వానాకాలంతోపాటు యాసంగి సీజన్‌లో కూడా పంటలకు నీరు అందుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా చేపల వేటనే నమ్ముకున్న 600 మత్స్యకార కుటుంబాలకు డిండి ప్రాజెక్టు జీవనాధారంగా మారింది. రెండు సంవత్సరాల వరకు చేతినిండా పని దొరకుతుందని, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన బాధ తప్పిందని వారు పేర్కొంటున్నారు.
రెండు నెలలుగా అలుగు పోస్తున్న డిండి ప్రాజెక్టు
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు, మత్స్యకారులు

ఆశలు నింపిన డిండి