
అంబులెన్స్ సేవలు ఉపయోగించుకోవాలి
మిర్యాలగూడ అర్బన్: అత్యవసర సమయంలో 108 సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జీవీకే ఈఎంఆర్‌ఐ జీహెచ్‌ఎస్ రాష్ట్ర ఆడిట్ అధికారి పకీర్ దాస్ అన్నారు. గురువారం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో 108 వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబులెన్స్‌లో ప్రభుత్వం నిర్దేశించిన అన్ని రకాల పరికరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని టెక్నీషియన్లకు సూచించారు. అంబులెన్స్‌లోని అత్యవసర సేవలకు ఉపయోగించే పల్స్ ఆక్సిమీటర్, మానీటర్, ఏఈడీ, ఆక్సిజన్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట 108 జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సలీం, ఈఎంఈ యల్లావుల మధు, ఈఎంటీ వెలిజాల సైదులు, పైలెట్ పగిళ్ల జానకిరాములు తదితరులు పాల్గొన్నారు.
108 అంబులెన్స్ తనిఖీ
వేములపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గల 108 అంబులెన్స్ వాహనాన్ని జీవీకే ఈఎంఆర్‌ఐ జీహెచ్‌ఎస్ రాష్ట్ర ఆడిట్ అధికారి పకీర్ దాస్ గురువారం తనిఖీ చేశారు. ఆయన వెంట కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సలీం, ఈఎంఈ ఎల్లావుల మధు, సిబ్బంది విమల, అజ్రకుమార్ తదితరులున్నారు.
ఈఎంఆర్‌ఐ జీహెచ్‌ఎస్
రాష్ట్ర ఆడిట్ అధికారి పకీర్ దాస్