
ఉద్యోగం వేటలో ఉన్నారా..
డీఈఈటీ యాప్‌లో వివరాలు నమోదు చేసుకోండి
భువనగిరిటౌన్ : ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి బయటకు వస్తున్నారు. చాలామంది ఉద్యోగాలు ఎక్కడ ఖాళీగా ఉన్నాయో తెలుసుకోలేక పోతున్నారు. ఇలాంటి వారికోసం తెలంగాణ సర్కార్ ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించింది. అదే డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈ ఈటీ). చదువు పూర్తయిన వారు, వివిధ కోర్సుల్లో చివరి సంవత్సరంలో ఉన్నవారు డీట్ యాప్ deet. telangana.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు.
నమోదు చేసుకునే విధానం..
అభ్యర్థులు తమ పేరు, వ్యక్తిగత వివరాలు, విద్యార్హత, అనుభవం, నైపుణ్యం తదితర వివరాలను యాప్‌లో నమోదు చేసుకోవాలి. వీటికి సంబంధించిన సర్టిఫికెట్‌లను అప్‌లోడ్ చేయాలి. ఆ తరువాత ప్రైవేట్ రంగంలోని ప్రతి కంపెనీ, సంస్థల్లో ఉన్న ఉద్యోగాల వివరాలు వస్తాయి. ఆ సంస్థకు కావాల్సిన నైపుణ్యాలు, వేతనం, అనుభవం వివరాలు కనిపిస్తాయి. అవి ఓకే అనుకుంటే సంబంధిత ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తరువాత సంస్థ ప్రతినిధులు యాప్‌లోనే మీ వివరాలు తెలుసుకుంటారు. ఇంటర్వ్యూ ప్రాంతం, ఇంటర్వ్యూ చేసే వ్యక్తి, సమయం వివరాలు తెలియజేస్తారు. వివిధ రంగాల్లో ఉన్న పోస్టులు, కొత్త అప్‌డేట్‌ల గురించి ఈ యాప్‌లో నోటిఫికేషన్లుగా ఇస్తుంటారు.
జనరద్దీ ప్రాంతాల్లో యాప్ పోస్టర్లు
నిరుద్యోగులు ఎక్కడి నుంచైనా తమ వివరాలను యాప్‌లో నమోదు చేసుకునేందుకు వీలుగా ఉపాధి కల్పన శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో క్యూఆర్‌తో కూడిన డీప్ యాప్ పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం కలెక్టరేట్‌లో వాటిని ఏర్పాటు చేశారు.
నిరుద్యోగ యువతకు సమాచారం కోసం ప్రత్యేక యాప్ రూపకల్పన
ప్రభుత్వ కార్యాలయాలు, జనరద్దీ ప్రాంతాల్లో యాప్ పోస్టర్లు ఏర్పాటు