
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన సేవలు
భువనగిరిటౌన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నాణ్యమైన వైద్యసేవలు అందుతాయని, గర్భిణులు సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. పోషణమాసంలో భాగంగా భువనగిరిలోని అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం జిల్లా సంక్షేమ శాఖ అధ్వర్యంలో గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసం చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. గర్భిణులు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని, తద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు వైద్యసేవలు పొందాలన్నారు. ప్రీ ప్రైమరీ స్కూళ్లలో పిల్లల నమోదు పెంచాలని అంగన్‌వాడీ టీచర్లకు సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపర్చడంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ టీచర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలను త్వరలోనే ప్రాథమిక పాఠశాల్లో కలుపనున్నట్లు తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయలో అమలయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ మనోహర్, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ హనుమంతరావు