
నేటి నుంచి అభిప్రాయ సేకరణ
సాక్షి, యాదాద్రి: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి(డీసీసీ) ఎన్నిక ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం అధిష్టానం నియమించిన ఏఐసీసీ పరిశీలకుడు శరత్‌రావత్ గురువారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన జిల్లాలోనే మకాం వేసి ప్రతి అంశాన్ని జల్లెడ పట్టనున్నారు. ఆలేరు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బ్లాక్‌ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీలోని అన్ని వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారు.
సమావేశాలు తేదీల వారీగా..
● శుక్రవారం ఉదయం భువనగిరిలో మీడియాతో మాట్లాడుతారు. అనంతరం జరిగే బ్లాక్‌స్థాయి సమావేశంలో పాల్గొని పార్టీలోని అన్ని వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేసి, ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
● 18వ తేదీన ఆలేరు, యాదగిరిగుట్ట బ్లాక్‌స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు.
● 19న ఆదివారం భువనగిరి, భూదాన్‌పోచంపల్లి బ్లాక్‌స్థాయి సమావేశాల్లో పాల్గొంటారు.
● 20న భువనగిరిలో మరోసారి పార్టీ క్యాడర్‌తో సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేయడంతో పాటు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. డీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న వారు దరఖాస్తులు ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. ఏఐసీసీ పరిశీలకుడితో పాటు పీసీసీ కోఆర్డినేటర్లు సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి, శాప్ చైర్మన్ శివచరణ్‌రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి హాజరుకానున్నారు.
డీసీసీ అధ్యక్షుడి
ఎన్నిక ప్రక్రియ మొదలు
జిల్లాకు చేరుకున్న ఏఐసీసీ పరిశీలకుడు
నాలుగు రోజులు ఇక్కడే మకాం
బ్లాక్‌ల వారీగా సమావేశాలు