
రెవెన్యూ ఉద్యోగుల జిల్లా కమిటీ ఎన్నిక
భువనగిరిటౌన్ : తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా కమిటీని గురువారం భువనగిరిలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎం.కృష్ణ, కార్యదర్శిగా ఆర్. శ్రీకాంత్, కోశాధికారిగా జానయ్య, అసోసియేట్ అధ్యక్షులుగా ఎండీ లాయిఖ్‌అలీ, సీహెచ్ శోభ, మరో 19 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, టీజీఓ రాష్ట్ర కోశాధికారి మందడి ఉపేందర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగులు ఐక్యంగా ఉంటూ తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, టీజీఓ జిల్లా అధ్యక్షుడిగా చికూరి జగన్‌మోహన్‌ప్రసాద్, టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడిగా భగత్ పాల్గొన్నారు. ఎన్నికల అధికారులుగా నారాయణరెడ్డి, నిరంజన్ వ్యవహరించారు.